ఫిబ్రవరి 27న బీసీల  నిరాహార దీక్ష.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఫిబ్రవరి 27న బీసీల  నిరాహార దీక్ష.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు:బడ్జెట్​లో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 27న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రకటించాయి. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు, ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ కలిసి దీక్ష వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.

గత, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్​లో రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో, రాజ్యసభ సీట్లలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. దుర్గయ్యగౌడ్, వెంకన్నగౌడ్, విజయ్ కుమార్  పాల్గొన్నారు.